ఏపీఈఏపీ సెట్‌లో 95% హాజరు

20 Aug, 2021 02:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీఈఏపీ సెట్‌ గురువారం ప్రశాంతంగా ప్రారంభమైంది. కంప్యూటరాధారితం (సీబీటీ)గా జరిగే ఈ పరీక్షల్లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ ఈనెల 20, 23, 24, 25వ తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. తొలిరోజు పరీక్షకు 95 శాతం మంది హాజరైనట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ బి.సుధీర్‌ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు.

ఉదయం సెషన్‌లో 18,229 మందికి గాను 17,186 మంది, మధ్యాహ్నం సెషన్‌లో 17,924 మందికి గాను 17,064 మంది హాజరయ్యారు. మొత్తంగా 36,153 మందికి గాను 34,250 మంది (94.73) శాతం హాజరయ్యారు. అగ్రి, ఫార్మా స్ట్రీమ్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 3, 6, 7వ తేదీల్లో జరుగుతాయి. పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని, ఎక్కడా సాంకేతిక సమస్యలు ఏర్పడలేదని ఉన్నత విద్యామండలి ఓఎస్డీ (సెట్స్‌) కె.సుధీర్‌రెడ్డి వివరించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు