96.25 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

3 Jan, 2021 05:57 IST|Sakshi
రొద్దంలో పింఛన్లు పంపిణీ చేస్తున్న పెళ్లి కూతురు గాయత్రి

రెండో రోజు కొనసాగిన పంపిణీ 

సాక్షి, అమరావతి/రొద్దం: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ రెండో రోజు శనివారం కూడా కొనసాగింది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేశారు. రెండు రోజుల్లో 59,41,480 మందికి రూ. 1,425.06 కోట్ల మేర పంపిణీ పూర్తి చేశారు. మొత్తం 96.25 శాతం పంపిణీ పూర్తయింది. ఆదివారం కూడా ఈ పంపణీ కొనసాగనుంది.  
ఒంగోలు నగరంలో దివ్యాంగుడు దుర్గావలికి పింఛన్‌ ఇస్తున్న వలంటీర్‌ కోటి   

పెళ్లి కూతురుగానే.. పింఛన్ల పంపిణీ 
ఆ వలంటీర్‌కు పెళ్లి కుదిరింది. శనివారం తొలి పసుపు (పెళ్లికూతురుని చేయడం). అయినా కూడా పింఛన్ల పంపిణీ చేసి అందరిమన్ననలు పొందింది అనంతపురం జిల్లా రొద్దం గ్రామ వలంటీర్‌ గాయత్రి. పింఛను లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో బాధ్యతను నెరవేర్చింది. సీఎం జగనన్న సంకల్పంలో తాను భాగస్వామిని కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపింది.  

మరిన్ని వార్తలు