తల్లైన తొమ్మిదో తరగతి విద్యార్థిని.. బిడ్డతో కలిపి ఆమెను..

26 Feb, 2022 07:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బొబ్బిలి(విజయనగరం): బొబ్బిలి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక గురువారం రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిసింది. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాఠశాలకు శుక్రవారం వచ్చి ఆరా తీసినట్టు సమాచారం. విద్యార్థిని ప్రసవించేంత వరకూ ఆమె కదలికలు, శరీరాకృతిని సిబ్బంది గుర్తించలేకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బిడ్డతో కలిపి బాలికను కొమరాడ మండలంలోని స్వగ్రామానికి ఆటోలో పంపించినట్టు భోగట్టా. ఈ విషయాన్ని ఆశ్రమ పాఠశాల పీడీ ఎస్‌బీఎస్‌ రత్నం వద్ద ప్రస్తావించగా అలాంటిదేమీ లేదని చెప్పారు. వసతి గృహంలో హాజరు పట్టీని, విద్యార్థినులను విచారించి శనివారం చెప్పగలనన్నారు. 

మరిన్ని వార్తలు