AP Budget 2023-24: పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్ల

16 Mar, 2023 12:43 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతమైన ఆస్తులను సృష్టించడానికి 16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా హామీ పథకం (ఎమ్‌జీఎన్‌ఆర్‌జీఎస్‌) అమలు చేస్తోంది.

ఈ ఆస్తులలో 10,917 గ్రామ సచివాలయ భనాలు, 10,243 వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసే నిర్మాణాలు, 8,320 భారత్‌ నిర్మాణ సేవా కేంద్రాలు, ఎక్కువ మోతాదులో పాల శీతలీకరణ చేసే 3,734 పాల శీతలీకరణ యూనిట్లు, నీటి సంరక్షణా కట్టడాలు ఉన్నాయి. డిసెంబర్‌ 2022 నాటికి ఈ రంగంలో సుమారుగా 18,39 కోట్ల పని దినాలు కల్పించాయి. అంతేగాక 98 శాతం చెల్లింపులు 15 రోజులలోపు చేశారు.

ఉచితంగా బోరు బావులు తవ్వి పంపుసెట్లను ఏర్పాటు చేస్తూ, తద్వారా సాగు యోగ్యమైన భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని పెంచేవిధంగా సీఎం జగన్‌.. సన్న, చిన్నకారు రైతుల కోసం వైఎస్సార్‌ జలకళ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28, 2020న ప్రారంభించారు. ఇప్పటి వరకు 17,047 బోరు బావులు తవ్వడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలో కుళాయి కనెక్షన్ల ద్వారా సుమారు 65 లక్షల ఇళ్లకు సురక్షిత మంచినీటిని అందించింది. జగనన్న కొత్త హౌసింగ్ కాలనీలతో సహా 2024 సంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు వీటి కిందకు తీసుకురాబడతాయి.

అంతేగాక 250  అంతకంటే ఎక్కువ జనాభా ఉండి రహదారుల అనుసంధానం లేని అన్ని నివాసాలకు అనుసంధానించడానికి  'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు'ను అమలు చేస్తోంది. ఇప్పటివరకు 1,737 కి.మీ. రహదారుల పొడవుతో సుమారు 1,198 ఆవాసాలు ఈ ప్రాజెక్టు క్రింద అనుసంధానం చేయబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,692 కి.మీ. రహదారి పొడవుతో అదనంగా 2,461 ఆవాసాలను కలుపుటకు ఈ ప్రాజెక్టు క్రింద ప్రణాళిక చేయబడింది. ప్రయోజనకరమైన ఈ రహదారుల అనుసంధానం వలన మార్కెట్ మెరుగుపడి రోజువారీ వేతనాల పెరుగుదలకు దారితీసింది.

►2023-24 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి 15,873 కోట్ల రూపాయల కేటాయించింది.

చదవండి: AP Budget: మహిళా సాధికారతే ధ్యేయంగా..

>
మరిన్ని వార్తలు