రఘురామ కొత్త నాటకానికి తెరతీశారు: ఏఏజీ పొన్నవోలు

15 May, 2021 20:18 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎంపీ రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి అన్నారు. హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌ అవ్వగానే కొత్త నాటకానికి తెరతీశారని, పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారని పేర్కొన్నారు. మధ్యాహ్నం రఘురామకృష్ణరాజుకు కుటుంబసభ్యులు భోజనం తీసుకొచ్చారని, అప్పటివరకు కూడా ఆయన మామూలుగానే ఉన్నారని చెప్పారు. రఘురామ ఆరోపణలపై కోర్టు మెడికల్‌ కమిటీ వేసిందని, రేపు మధ్యాహ్నంలోగా పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని సూచించిందని తెలిపారు. 

కాగా, ఎంపీ రఘురామకృష్ణరాజును అధికారులు ఈ సాయంత్రం సీబీసీఐడీ స్పెషల్‌ కోర్టులో హాజరుపర్చారు. సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్‌ రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేశారు.

ఇక్కడ చదవండి: రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు