వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్, కడపలో 12 ఖాళీలు

14 Jun, 2021 12:47 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన కడప జిల్లాలోని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 12

అర్హత: మంచి అకడమిక్‌ రికార్డ్‌తో బీఎస్సీ(నర్సింగ్‌), ఎమ్మెస్సీ(నర్సింగ్‌), బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మా డీ, బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్, తెలుగు, ఇంగ్లిష్‌ చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వేతనం: నెలకు  రూ.12,000 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: విద్యార్హతలు, కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్, డోర్‌ నెం.57–98–1, అక్కయ్యపల్లి, శాస్త్రి నగర్, కడప చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 17.06.2021

► వెబ్‌సైట్‌: kadapa.ap.gov.in

మరిన్ని నోటిఫికేషన్లు:
ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌, 10 వేలకు పైగా ఉద్యోగాలు

NMDC Recruitment 2021: ఎన్‌ఎండీసీలో 89 పోస్టులు

మరిన్ని వార్తలు