సీఎం సహాయ నిధికి రూ.1.33 కోట్ల విరాళం

24 Apr, 2021 06:05 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విరాళాల చెక్కులను అందజేస్తున్న మంత్రి కన్నబాబు

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నియంత్రణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 1,33,34,844 విరాళం వచ్చింది. ఈ విరాళం ఇచ్చిన వారిలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్థలు, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. విరాళానికి సంబంధించిన చెక్కులను సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. 

విరాళాలు అందజేసిన సంస్థల్లో కొన్ని
► ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్, విజయవాడ రూ. 14,20,000
► ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ పీవీఎస్‌ఎస్‌ మూర్తి రూ. 15,00,000
► కాళేశ్వరీ రిఫైనరీ అండ్‌ ఇండస్ట్రీ ప్రై.లిమిటెడ్‌ రూ. 25,00,000
► కాకినాడ ట్రస్ట్‌ హాస్పిటల్‌ రూ. 1,00,000
► భవాని కాస్టింగ్స్‌ ప్రై.లిమిటెడ్‌ రూ. 5,00,000
► వేద సీడ్‌ సైన్స్‌ ప్రై.లిమిటెడ్‌ రూ. 10,00,000
వీటితో పాటు మరికొన్ని సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేసిన వాటిలో ఉన్నాయి.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు