కొత్తగా 2.90 లక్షల బియ్యం కార్డులు

10 Aug, 2020 06:43 IST|Sakshi

2 నెలల్లో జారీ చేసిన సంఖ్య ఇది

రాష్ట్రంలో 1,50,15,765కు చేరిన మొత్తం కార్డులు

దరఖాస్తు చేసిన వెంటనే స్పందన

సాక్షి, అమరావతి: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం కాగా.. ఇందుకు అనుగుణంగా ఎలాంటి దళారులకు ప్రమేయం లేకుండా, పేదలు నేరుగా గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే చాలు.. అర్హత ఆధారంగా సంక్షేమ పథకాల కోసం కార్డులను మంజూరు చేస్తున్నారు. 

► దరఖాస్తులను పరిశీలించి.. గడిచిన 2 నెలల్లోనే అర్హత ఉన్న 2.90 లక్షల కుటుంబాలకు పైగా బియ్యం కార్డులను మంజూరు చేశారు.  
► ప్రస్తుతం రాష్ట్రంలో బియ్యం కార్డుల సంఖ్య 1,50,15,765కి చేరింది. 
► రాష్ట్రంలో ప్రస్తుతం తొమ్మిదవ విడత ఉచిత సరుకుల పంపిణీ కొనసాగుతుండగా.. ఆదివారం వరకు 97.24 లక్షల కుటుంబాలకుపైగా లబ్ధి పొందాయి. 
► రెండు విడతలుగా పంపిణీ చేస్తున్నందున ప్రతి నెలా దాదాపు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం అవుతున్నాయి. 
► ఇక కార్డు కోసం పేదలు తిరిగి గ్రామ సచివాలయానికి రాకుండా.. గ్రామ వలంటీర్‌ నేరుగా వారి ఇంటికి వెళ్లి కార్డులు ఇస్తుంటే పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
► అర్హత ఉండి గత ప్రభుత్వ హయాంలో బియ్యం కార్డు కోసం అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా అదిగో ఇదిగో అంటూ తిప్పుకునేవారు తప్ప వారికి మాత్రం కార్డు మంజూరయ్యేది కాదు.   

మరిన్ని వార్తలు