మత్స్య రంగానికి రూ.3,450.92 కోట్ల రుణం

27 Apr, 2021 05:12 IST|Sakshi

గత ఏడాది కన్నా 26.81 శాతం అధికంగా అవసరం

రాష్ట్ర ఫోకస్‌ పత్రంలో నాబార్డ్‌ వెల్లడి

మత్స్యకారుల జీవనోపాధి మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై ప్రశంస  

సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో మత్స్య రంగానికి రూ.3,450.92 కోట్ల రుణం అవసరమని నాబార్డ్‌ అంచనా వేసింది. ఇది గత ఏడాది కన్నా 26.81 శాతం అధికమని పేర్కొంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఫోకస్‌ పత్రంలో నాబార్డ్‌ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటోందని ప్రశంసించింది.

మత్స్యకారుల బోట్లకు ఇచ్చే డీజిల్‌ సబ్సిడీని పెంచిందని, వేట నిషేధ సమయంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పేరుతో వరుసగా రెండేళ్లు వారికి ఆర్థికసాయం అందించిందని తెలిపింది. ఆక్వా రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుందని,  రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన సర్టిఫైడ్‌ ఇన్‌పుట్స్‌ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టిందని, ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని వివరించింది. ఈ నేపథ్యంలో ఈ రంగానికి రుణ అవసరం గతంతో పోలిస్తే బాగా పెరిగిందని నాబార్డ్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు