భూముల రీసర్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి

20 Aug, 2021 02:57 IST|Sakshi

ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం ఆదేశం 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీసర్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని రాష్ట్రస్థాయి స్టీరింగ్, ఇంప్లిమెంటేషన్‌ కమిటీ చైర్మన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో భూముల రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.

తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న అర్బన్‌ సర్వే పైలట్‌ ప్రాజెక్టు పూర్తి కానుండగా, త్వరలోనే ఇతర పట్టణాలకు విస్తరించనున్నామని ఆశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సర్వే, సెటిల్మెంట్, భూమి రికార్డుల కమిషనర్‌ సిద్దార్థ జైన్‌ మాట్లాడుతూ..రీసర్వే పనులకు అవసరమైన పరికరాల కొనుగోలు టెండర్లను వెంటనే పిలవాలని కమిటీ నిర్ణయించిందన్నారు.  సరిహద్దుల వద్ద భూరక్ష రాళ్లను వెంటనే ఏర్పాటు చేసేందుకు స్టీరింగ్‌ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. 

మరిన్ని వార్తలు