అద్దంకి–నార్కెట్‌పల్లి హైవే ఇకపై.. కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌ వే

25 Feb, 2023 05:23 IST|Sakshi
కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌ వేగా నామకరణం చేసిన అద్దంకి–నార్కెట్‌పల్లి హైవే

ఉత్తర్వులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 

దాచేపల్లి: పల్నాడు ప్రాంతానికి చెందిన రాజకీయ యోధుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మానందరెడ్డి పేరు చిరస్మరణీయంగా నిలిచేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బ్రహ్మానందరెడ్డి చేసిన సేవలు, ఆయన చేసిన అభివృద్ధిని గుర్తించిన ప్రభుత్వం హైదరాబాద్‌–విజయవాడ హైవే, విజయవాడ–చెన్నై హైవేలను కలుపుతూ పల్నాడు ప్రాంతంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి ప్రధాన రహదారికి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌ వేగా నామకరణం చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది.

సుమారుగా 200 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారికి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌ వేగా నామకరణం చేయడంపై పల్నాడు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారికి తన తాత పేరు పెట్టడంపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్సార్‌ హయాంలో ఈ హైవే నిర్మాణాన్ని చేపట్టారు. 

మరిన్ని వార్తలు