‘ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ద్వారా పూర్తి పారదర్శకత’

31 Oct, 2020 20:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి బడిగంటలు మోగబోతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సరేష్‌ తెలిపారు. కరోనా కారణంగా అయిదు నెలల ఆలస్యంగా తరగతులు ప్రారంభవుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలకు సూచనలకు అనుగుణంగా పాఠశాలలు ప్రారంభవుతున్నాయన్నారు. ఈ మేరకు శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..నవంబర్ 2వ తేదీన 9,10 తరగతులు, ఇంటర్ సెకండియర్ తరగతులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నవంబర్‌ 16 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంబిస్తామని తెలిపారు. నవంబర్ 23న అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకుల పాఠశాలలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. చదవండి: మొదటి నెల రోజులు హాఫ్‌ డే స్కూళ్లు

23న ఆరు, ఏడు, ఎనిమిది తరగతి‌ విద్యార్ధులకు, డిసెంబర్ 14 నుంచి ఒకటి నుంచి అయిదవ తరగతి వరకు విద్యార్ధులకు తరగతులు ప్రారంబిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు. నవంబర్ 2న నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల రెండవ సంవత్సరానికి సంబంధించిన విద్యార్ధులకు తరగతులు ప్రారంబిస్తామన్నారు. మార్చి నెలాఖరుకి తొలి సెమిస్టర్ పూర్తి చేస్తామని, ఆగష్టు నాటికి ఫైనల్ సెమిస్టర్ పూర్తి చేస్తామన్నారు. బీటెక్‌, బీ ఫార్మా కోర్సులకు సంబంధించి సీనియర్ విద్యార్ధులకు నవంబర్ రెండు నుంచి, మొదటి సంవత్సరం విద్యార్దులకు డిసెంబర్ ఒకటిన తరగతులు ప్రారంబిస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలకు సంబంధించి పరీక్షల ప్రణాళిక షెడ్యూల్ కూడా రూపొందించినట్లు తెలిపిన మంత్రి ఆదిమూలపు సరేష్‌ 180 రోజులపాటు పని దినాలు ఉండేలా విద్యా సంవత్సరం రూపొందించినట్లు వెల్లడించారు. చదవండి: నవంబర్ 2 నుండి పాఠశాలల పునఃప్రారంభం

తప్పుడు ప్రచారం చేస్తున్నారు
‘విద్యార్ధులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. ప్రతీ విద్యార్థి భౌతిక దూరం పాటించేలా.. తరగతి గదులు ఎప్పటికపుడు శానిటైజ్ చేసే విధంగా ప్రత్యేక ఆదేశాలు. ప్రస్తుతం ఒక పూట మాత్రమే తరగతులు నిర్వహిస్తాం. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపిస్తాం. ఇంటర్ అడ్మిషన్లలో ఎక్కడా గందరగోళం లేదు. ఆన్‌లైన్ అడ్మిషన్ల ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఇంటర్ అడ్మిషన్లలో సీట్ల కొరతంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా సీట్ల కొరత లేదు. ఇంటర్‌లో 5,83,580 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా 561 కళాశాలల ఏర్పాటుకు నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. కనీస సౌకర్యాలు కూడా కల్పించని కొన్ని కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా. కనీస సౌకర్యాలు కల్పించని 613 కళాశాలలపై చర్యలు తీసుకున్నాం’. అని వెల్లడించారు.

మరిన్ని వార్తలు