ఈ ఏడాది నుంచే ‘ఆనర్స్‌’

7 Aug, 2020 08:57 IST|Sakshi

డిగ్రీ, ఇంజనీరింగ్‌లో అమలు

సెప్టెంబర్‌ 3వ వారం నుంచి ఎంసెట్‌ సహా వివిధ ప్రవేశ పరీక్షలు 

విద్యాశాఖ మంత్రి సురేష్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ఆనర్స్‌ పద్ధతిని ప్రవేశపెట్టనున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. సీఎం జగన్‌ సమీక్ష అనంతరం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ..

విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా ప్రోత్సహించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా వివిధ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నందున ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ 90 శాతానికి పెరగాలి. 3 ఏళ్ల డిగ్రీ, నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే అమలు. వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లోనూ ఆనర్స్‌ విధానం.
నాలుగేళ్ల బీఈ, బీటెక్‌ కోర్సుల్లో 10 నెలలు అప్రెంటిస్‌షిప్‌ విధానం. కనీసం 20 క్రెడిట్లు సాధిస్తే బీటెక్‌ ఆనర్స్‌ డిగ్రీ. ఉదాహరణకు బీటెక్‌ మెకానికల్‌ చేస్తూ కంప్యూటర్‌ సైన్సులో కొన్ని అంశాలను అధ్యయనం చేయడం ద్వారా 20 క్రెడిట్లు సాధిస్తే ఆ విద్యార్థికి బీటెక్‌ ఆనర్స్‌ ఇవ్వాలని సూచన.
ప్రకాశంలో ఉపాధ్యాయ విద్య కోర్సుకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక వర్సిటీ, విజయనగరంలో మరో కొత్త వర్సిటీని ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని సీఎం ఆదేశం. టీచర్‌ ట్రైనింగ్‌ వర్సిటీకి జిల్లాల్లోని టీచర్‌ ట్రైనింగ్‌ సంస్థలు అనుబంధంగా ఉంటాయి.
సెప్టెంబర్‌ 3వ వారం నుంచి ఎంసెట్‌ సహా వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణ.  

మరిన్ని వార్తలు