‘బాబు హయాంలో తెలుగు అకాడమీ అస్థిత్వాన్ని కోల్పోయింది’

14 Jul, 2021 17:57 IST|Sakshi

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: తెలుగు సంస్కృత అకాడమీపై విమర్శలెందుకో అర్థంకావడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. అకాడమీపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుభాష అభివృద్ధి, విస్తృతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చంద్రబాబు హయాంలో తెలుగు అకాడమీ అస్థిత్వాన్ని కోల్పోయిందని మండిపడ్డారు.

తెలుగు, సంస్కృత భాషలను వేర్వేరుగా చూడలేమని, తెలుగుభాష మూలాలు తెలుసుకోవాలంటే పరిశోధన అవసరమని తెలిపారు. తెలుగు అకాడమీ ఆస్తుల పంపకంపై తెలంగాణతో చర్చించామని పేర్కొన్నారు. విభజన చట్టం మేరకు రూ.200 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉందమని ఆయన తెలిపారు. తెలుగు అకాడమీ పబ్లికేషన్స్‌ డివిజన్‌ను గతంలో మూసేశారని అన్నారు. పోటీ పరీక్షలకు ఉపకరించే ఈ పబ్లికేషన్స్‌ను మళ్లీ మొదలుపెట్టాల్సి ఉందని మంత్రి చెప్పారు.

 

మరిన్ని వార్తలు