‘ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి’

1 Apr, 2021 11:18 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీ‌పీ ప్రభుత్వం పనితీరు,‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీని తీసుకొస్తాయి అంటూ అదిమూలపు సురేష్ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు టీడీపీని నమ్మే స్థితిలో లేరని ఈ విషయం తెలియక ఆ పార్టీ నేతలు ఇంకా గెలుస్తామనే భ్రమల్లో బతుకుతున్నారని అన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైస్సార్‌సీపీ ఎంపీలు గొర్రెలంటూ నోరూపారేసుకోవడం సరైన పద్ధతి కాదంటూ మండిపడ్డారు.

టీడీపీ ఎంపీలు సింహాలో లేక గుంటనక్కలో ఈ ఉపఎన్నికల్లో తిరుపతి ప్రజలే తమ ఓటు ద్వారా తేలుస్తారని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను కేవలం మీ స్వార్థం కోసం తాకట్టు పెట్టి ,ప్యాకేజీకి కక్కర్తి పడింది టీడీపీ ప్రభుత్వం కాదా ? అని ప్రశ్నించారు. ప్రస్తుతం కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ రూపంలో మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్న సమయంలో స్కూళ్ల లో నిబంధనలు పాటించకుండా విద్యార్థుల ఆరోగ్యం తో ఆడుకుంటే ఆ స్కూళ్ల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

( చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: ‘ఫ్యాను’దే హవా ) 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు