ఎల్లోమీడియా కథనాలు.. ఆ మేధావులకు నా నమస్కారాలు: మంత్రి కాకాణి

16 Jun, 2022 11:30 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, నెల్లూరు: రైతులకు పంట నష్ట పరిహారంపై ఎల్లో మీడియా అసత్య కథనాలను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఖండించారు. ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులందరికీ నష్టపరిహారం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు నెల్లూరులో మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. పంటల బీమా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. రైతు ఒక్క రూపాయి కుడా కట్టకుండా ప్రీమియం చెల్లించేలా చర్యలు చేపట్టాం. ఈ క్రాప్‌లో నమోదు చేసుకొంటే చాలు.. రూ.3 వేల కోట్ల బీమా రైతులకు చెల్లిస్తున్నాము. నష్టపరిహారంపై తప్పుడు రాతలు రాస్తున్నారు. విషయ పరిజ్ఞానం లేకుండా ఎల్లో మీడియాలో కథనాలు సిగ్గుచేటు. ఆ మేధావులకు నా నమస్కారాలు అని మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి అన్నారు..

'విలేజ్‌ని యూనిట్‌గా తీసుకొని పారదర్శకంగా బీమా పథకాన్ని అమలు చేస్తున్నాము. 31 పంటల్లో 5 పంటలకు నష్టం జరగ లేదని అధికారులు నివేదిక ఇచ్చారు. నష్టపోయిన ప్రతీ రైతుకూ పరిహారం అందిస్తున్నాము. టీడీపీ హయాంలో రూ.596 కోట్ల బకాయిలు ఎగ్గొట్టి పోయారు. రైతులు జోరుగా ఉంటే చంద్రబాబు బేజారు అయిపోతాడు. చంద్రబాబు రైతులకు ఏమి చేశారో చెప్పాలి. దోపిడీ పథకాలు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటి కూడా టీడీపీ చేయలేదు. రుణమాఫీ విషయంలో రైతులను టీడీపీ మోసం చేసింది. ఇప్పుడు సిగ్గులేకుండా రైతు యాత్ర అంటున్నాడు. చంద్రబాబు చేసిన పాపాలు రాష్ట్రానికి శాపాలుగా మారాయని' మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. 

చదవండి: (గోరంట్ల వెర్సెస్‌ ఆదిరెడ్డి.. సిటీ సీట్‌ హాట్‌ గురూ..!) 

మరిన్ని వార్తలు