ప్రకృతి సాగులో ఏపీ ఆదర్శం

25 Sep, 2022 04:39 IST|Sakshi
జైవిక్‌ ఇండియా అవార్డులు అందుకుంటున్న ఏపీ రైతు సాధికార సంస్థ థీమెటిక్‌ లీడ్‌ ప్రభాకర్‌

కేంద్ర ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ సలహాదారు ఏకే యాదవ్‌ కితాబు

రాష్ట్రానికి నాలుగు జైవిక్‌ ఇండియా అవార్డులు

ఆగ్రాలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం

సాక్షి, అమరావతి : ప్రకృతి సాగులో దేశానికే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ సలహాదారు ఏకే యాదవ్‌ అన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున చేపట్టిన ప్రకృతి సాగును ఆదర్శంగా తీసుకుని మణిపాల్‌ సహా ఈశాన్య రాష్ట్రాలు ముందుకు వెళుతున్నాయని చెప్పారు. ఆర్గానిక్‌ ఫుడ్‌ ఇండియా పోటీల్లో రాష్ట్రానికి నాలుగు ప్రతిష్టాత్మక పాన్‌ ఇండియా (జైవిక్‌ ఇండియా) అవార్డులు దక్కాయి.

ఆగ్రాలో శనివారం జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో ఈ అవార్డులను కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి శివయోగి కాల్షద్‌తో కలిసి ఏకే యాదవ్‌ అందజేశారు. ఏపీ రైతు సాధికార సంస్థ  తరఫున థీమెటిక్‌ లీడ్‌ ప్రభాకర్, మా భూమి సంఘ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నూకమ్‌ నాయుడు, నిట్టపుట్టు సంఘ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గంగరాజుతోపాటు వైఎస్సార్‌ జిల్లాకు చెందిన బండి ఓబులమ్మ ఈ అవార్డులను అందుకున్నారు.

ఈ సందర్భంగా ఏకే యాదవ్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రకృతి సాగు విస్తరణ దిశగా కేంద్రం తీసుకుంటున్న చర్యలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వమే స్ఫూర్తి అని చెప్పారు. తమ రాష్ట్రంలో కూడా ప్రకృతి సాగును ప్రోత్సహించే దిశగా కృషి చేస్తున్నట్లు కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు