సీఎం వైఎస్‌ జగన్‌ పాలన భేష్‌

31 Jul, 2022 09:44 IST|Sakshi

వైఎస్సార్‌ నాకు అన్నయ్య లాంటి వారు

తెలంగాణ కంటే ఆంధ్రాలో మెరుగైన భద్రత

ఆల్‌ ఇండియా యాంటీ టెరర్రిస్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ ఎంఎస్‌ బిట్ట

భీమవరం(పశ్చిమ గోదావరి జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన బాగుందని ఆల్‌ ఇండియా యాంటీ టెర్రరిస్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ మనేంద్రసింగ్‌ జిత్త్‌ బిట్ట (ఎంఎస్‌ బిట్ట) తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌ తనకు అన్నయ్య లాంటివారని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉండేదన్నారు. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచివారని, మంచి పాలన అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ కన్నా ఆంధ్రా సురక్షిత ప్రాంతమని,  ఆంధ్ర ప్రభుత్వానికి, పోలీసులకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. 

తెలంగాణ బేకార్‌ అని, అక్కడ పొలిటికల్‌ టెర్రరిజం ఉందని, అటువంటి విధానం ఆంధ్రాలో లేదన్నారు. తెలంగాణ కంటే ఆంధ్రా పోలీసుల భద్రత చాలా బాగుందన్నారు. హైదరాబాద్‌ సురక్షితమైన ప్రాంతం కాదని.. కానీ ఆర్థికంగా బలమైందన్నారు. కాగా, భీమవరానికి చెందిన ప్రముఖ హస్తసాముద్రిక నిపుణుడు మాండ్రు నారాయణ రమణారావు ఆహ్వానం మేరకు తాను ఇక్కడికి వచ్చినట్టు ఎంఎస్‌ బిట్ట చెప్పారు. ముందుగా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో శక్తీశ్వరస్వామిని, అనంతరం భీమవరం హౌసింగ్‌ బోర్డు కాలనీలోని వేంకటేశ్వరస్వామిని ఎంఎస్‌ బిట్ట  దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు