కాణిపాకం ఆలయానికి కొత్త మెరుగులు.. మహా కుంభాభిషేకానికి సర్వం సిద్ధం

20 Aug, 2022 18:52 IST|Sakshi

 ఈ నెల 21న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి చతుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకం

కుంభాభిషేకం అనంతరం దర్శ నానికి అనుమతి

పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలం కరణలతో శోభాయమానంగా కాణిపాక ఆలయం

సాక్షి, చిత్తూరు: వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి మహా కుంభాభిషేకానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 21న ఆదివారం శాస్త్రోక్తంగా చతు ర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం నిర్వహణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వస్తి  శ్రీ చంద్రమాన శుభ కృత్ నామ సంవత్సర శ్రావణ బహుళ దశమి మృగశిరా నక్షత్ర యుక్త  శుభ కన్యా లగ్నము నందు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు వరకు విమాన గోపురం, ధ్వజస్తంభానికి మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. 

►మహా కుంభాభిషేకంలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి చతుర్థ కాల హోమము, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన

►ఉదయం 8 నుంచి 8.30 గంటలలోపు రాజ గోపురం, పశ్చిమ ద్వార గోపురం, స్వామి వారి విమాన గోపురం, నూతన ధ్వజ స్తంభములకు మహా కుంభాభిషేకం

►ఉ.8:30 నుంచి 9 గంటల పు స్వయం భు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి కుంభాభిషేకం, తీర్థ ప్రసాద వినియోగం, యజమానోత్సవం.

►మహా కుంభాభిషేకము అనంతరం మ.2 గంటల  నుంచి స్వామి వారి మూల విరాట్ దర్శనం కల్పించనున్నారు.

►సా. 6 నుంచి శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి తిరు కళ్యాణం. అలాగే గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

ఈనెల 21 నుంచి మూల విరాట్ స్వయంభు వినాయక పునర్దర్శనం భక్తులకు అందుబాటులో రానున్నది. ఆలయ పునర్నిర్మాణానికి కృష్ణా జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు గాయత్రీ దేవి, ఐకా రవి దంపతులు.. గుత్తికొండ జానకి,శ్రీ గుత్తికొండ శ్రీనివాస్ దంపతులు రూ.10 కోట్ల విరాళం ఇచ్చారు.

దేవస్థానంలో అభివృద్ధి పనులు 

► రూ.5 కోట్లతో నూతన లడ్డు పోటు,  పడి తరం స్టోరు నిర్మాణం

► సుమారు రూ. 12 కోట్లతో వినాయక సదన్ వసతి గదుల 2, 3 వ అంతస్తుల నిర్మాణం

►  సుమారు రూ.9 కోట్లతో భక్తుల సౌక ర్యార్థం నూతన ఏసీ, నాన్ ఏసీ కళ్యాణ మండపంలో నిర్మాణానికి ప్రతిపాదనలు జరిగాయి.

►  సుమారు రూ. 20 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్ భవనానికి సంబంధించిన నిర్మాణానికి అంచనా 

►  సుమారు రూ. 14 కోట్లతో నూతన బస్టాండు మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అంచనా.

►  సుమారు రూ. 4 కోట్లతో 100 అడుగుల రోడ్డు మరియు స్వాగతం ఆర్చి గేట్ నిర్మాణానికి చర్యలు..

మరిన్ని వార్తలు