కరోనా పట్ల ఆందోళన అవసరం లేదు: ఆళ్లనాని

29 Jul, 2020 20:50 IST|Sakshi

సాక్షి, కాకినాడ: కరోనా పట్ల ఆందోళన చెందనవసరం లేదని తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు మంత్రి ఆళ్ల నాని సూచించారు. 'జిల్లాలో అత్యధికంగా రోజుకు 8వేల కోవిడ్‌ టెస్టులు జరుగుతున్నాయి. ఆరు ఆస్సత్రును ఏర్పాటు చేశాం. వీటితోపాటు వెయ్యి బెడ్లతో మరో మూడు కోవిడ్ ఆసుపత్రులను సిద్దం చేస్తున్నాం. ఐదు వేల బెడ్స్‌తో ఐదు కోవిడ్ కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ఏజెన్సీలో రంపచోడవరం, చింతూరులలో రెండు కోవిడ్ కేర్ సెంటర్‌లు ఏర్పాటు' చేయనున్నట్లు మంత్రి నాని తెలిపారు. కాగా మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ జ్యువెలరీ వ్యాపారి విశాఖపట్నంలో కోవిడ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో జిల్లాలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.  (‘ఆ మరణాలు దాచాల్సిన అవసరం లేదు’)

మరిన్ని వార్తలు