అరకు ప్రమాదం: కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ

13 Feb, 2021 13:21 IST|Sakshi

సాక్షి, విశాఖటప్నం: అరకు ప్రమాద ఘటనపై కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని‌ శనివారం తెలిపారు. ఆయన మీడియా మాట్లాడుతూ.. ఈ ప్రమాద ఘటన బాధాకరం అన్నారు. తెలంగాణ నుంచి 27 మంది అరకు ప్రాంతానికి వచ్చారని, ప్రమాదంలో నలుగురు మృతి చెందారని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతకు ముందు అరకు ఘాట్‌రోడ్‌ ప్రమాద ఘటనలో గాయపడి కేజీహెచ్‌ ఆస్పత్రిలో చేరిన బాధితులను మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్‌ పరామర్శించారు. వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అరకు ఘాట్‌రోడ్‌ ప్రమాద ఘటనలో గాయపడిన 23 మంది బాధితులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతురన్నారని డీఎంహెచ్‌వో తెలిపింది. అందులో చంద్రకళ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది పేర్కొంది. నాలుగు మృతదేహాలకు పోస్ట్‌ మార్టం పూర్తి చేసినట్లు తెలిపింది. 

చదవండి: లోయలో పడ్డ బస్సు: నలుగురు మృతి‌

మరిన్ని వార్తలు