చంద్రబాబు ఖజానా ఖాళీ చేశారు

6 Aug, 2020 04:29 IST|Sakshi

అయినా కూడా కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం : డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

కడప సిటీ: చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి వెళ్లారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి బాగోకపోయినప్పటికీ సీఎం వైఎస్‌ జగన్‌ కరోనా నియంత్రణకు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో రోజూ 50 వేల నుంచి 60 వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బుధవారం కడప కలెక్టరేట్‌లో కరోనాపై డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి ఆళ్ల నాని సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘కరోనా బాధితులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపడమే సీఎం ధ్యేయం. కరోనా నియంత్రణకు నెలకు దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అని చెప్పారు. చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు