కోవిడ్ మరణాలు దాచాల్సిన అవసరం లేదు: ఆళ్ల నాని

29 Jul, 2020 14:48 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: కోవిడ్‌పై చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం రోజున కోవిడ్‌పై ఏర్పాటు చేసిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పరీక్షల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా ఏపీ ఉంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే కరోనా డెత్‌ రేట్ తక్కువగా ఉంది. ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యానికి నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అత్యంత పారదర్శకంగా కరోనా చర్యలు చేపడుతున్నాం. (సీఎం జగన్‌ అధ్యక్షతన బ్యాంకర్ల కమిటీ భేటీ)

ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు సరికావు. ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కడా డాక్టర్ల కొరత లేదు. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే 24 గంటల్లోనే పరిష్కరించాం. చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడాము. ప్రస్తుతం జిల్లాలో ఆరు కోవిడ్ ఆసుపత్రులు ఉన్నాయి. వాటి సంఖ్య మరో మూడు పెంచుతున్నాం. వైద్యులు, నర్సులు, ఇతర స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా చేపడుతున్నాం. జిల్లాలో 2 కోవిడ్ సెంటర్లకు అదనంగా మరో రెండు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. కోవిడ్ మరణాలు కూడా దాచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు' అని మంత్రి ఆళ్లనాని తెలిపారు. (చంద్రబాబుది పైశాచిక ఆనందం)

మరిన్ని వార్తలు