వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం

29 Nov, 2021 18:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండటానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కోవిడ్‌ టీకాల పురోగతి, ఆక్సిజన్‌ బెడ్స్ సామర్థ్యంపై సీఎం జగన్  సమీక్ష నిర్వాహించారు. సమీక్ష అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల నుంచి రాష్ట్రాని వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని సీఎం సూచించారని తెలిపారు.

చదవండి: వరదబాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్‌ నెలాఖరు నుంచి జనవరి 15లోపు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారని తెలిపారు. ఆస్పత్రుల్లో వసతులు, సౌకర్యాలు పెంచుతూ.. కోవిడ్‌ పరీక్షల సంఖ్యను పెంచాలని తెలిపారని చెప్పారు. కోవిడ్‌ విషయంలో గతంలో తీసుకున్న అన్ని చర్యలను అధికారులు అమలు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించానట్లు పేర్కొన్నారు. అదే విధంగా ప్రజలంగా కోవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. 

కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసి, కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసిందని తెలిపారు. ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు ఏపీలో నమోదు కాలేదని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలు పాటించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, కొత్త వేరియంట్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలో అన్ని గైడ్ లైన్స్ విడుదల చేస్తామని మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. 
 

      

>
మరిన్ని వార్తలు