పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు?

25 May, 2022 17:13 IST|Sakshi

సాక్షి,అమలాపురం: అమలాపురం అల్లర్ల కేసులో అనుమానితుడు అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20న కలెక్టరేట్‌ వద్ద.. కోనసీమకు అంబేద్కర్‌ పేరు పెట్టొంద్దంటూ అన్యం సాయి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని హల్‌ చల్‌ చేశాడు. జనసేన కార్యక్రమాల్లో అనుమానితుడు సాయి చురుగ్గా పాల్గొన్నట్టు తెలుస్తోంది. పవన్‌, నాగబాబు, జనసేన నాయకులతో అతను దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కోనసీమ అల్లర్ల కేసులో సాయి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతనిపై గతంలో రౌడీషీట్‌ నమోదై ఉందని పోలీసులు తెలిపారు.


(చదవండి: అమలాపురం ఘటన వెనుక కుట్ర.. వదిలేదే లేదు: మంత్రి బొత్స)

మరిన్ని వార్తలు