విజయవాడ ఆస్పత్రి ఘటన..  రూ.10 లక్షల పరిహారం

23 Apr, 2022 05:23 IST|Sakshi
అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మంత్రులు తానేటి వనిత, విడదల రజని, జోగి రమేష్‌ తదితరులు

దోషులను కఠినంగా శిక్షిస్తాం

బాధితురాలికి రూ.10 లక్షల చెక్కు అందజేత

ఇంటిస్థలం, ఇల్లు కట్టించడం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగానికి హామీ  

మంత్రులు తానేటి వనిత, విడదల రజని, జోగి రమేష్‌

సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు)/విజయవాడ స్పోర్ట్స్‌ : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఉపేక్షించవద్దని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సీఎంఓ అధికారులకు ఆయన ఆదేశాలి చ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. మరోవైపు.. ఈ ఉదంతానికి సం బంధించి సీఎం జగన్, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆ దేశాల మేరకు.. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలపై సీఐ హనీష్‌కుమార్, సెక్టార్‌ ఎస్సై శ్రీని వాస్‌ను సస్పెండ్‌ చేశారు.

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు, శాంతిభద్రతల రక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ కూడా ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకుంది. నిందితులను ఫాగింగ్‌ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించి వారిని విధుల నుంచి తొలగించింది. విజయవాడ ఆస్పత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫా గింగ్‌ ఏజెన్సీకి టెర్మినేషన్‌ నోటీసు జారీచేసింది. ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ ఆర్‌ఎం ఓకి షోకాజ్‌ నోటీసు జారీచేశారు.

శాఖాపరంగా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని మెడికల్‌ ఎడ్యుకేష న్‌ డైరెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. నివేదిక తర్వాత మరి న్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖను  ఆదేశించారు. మరోవైపు.. అత్యాచార ఘటనపై శాఖా పరంగా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని డీఎంఈ రాఘవేంద్రరావును ఆదేశించారు. దర్యాప్తు నివేదిక అందిన వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టంచేశారు.

ఇక అత్యాచార ఘటనలో దోషులను కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి తానేటి వనిత వెల్లడిం చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. విజయవాడలోని పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు, ఆమె కుటుంబాన్ని శుక్రవారం మంత్రులు తానేటి వనిత, విడదల రజని, జోగి రమేష్, మాజీమంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, కలెక్టర్‌ ఢిల్లీరావు పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కును బాధితురాలికి అందజేసి, అన్ని విధాలా ఆదుకుంటామని వారి కి భరోసా ఇచ్చారు. అనంతరం తా నేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరగడం దురదృష్టకరమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. నిందితులను అరెస్టు చేశామన్నా రు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారని చెప్పా రు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ మహిళలపై ఎన్నో దాడులు జరిగాయని గుర్తుచేశారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేసేందుకే  ఈ  టనను రాజకీయం చేశారని విమర్శించారు. 

వైద్య సిబ్బందిపైనా చర్యలు
మంత్రి రజని మాట్లాడుతూ.. నిందితులు పెస్ట్‌ కంట్రోల్‌ ఉద్యోగులు కావడంతో ఆస్పత్రిలో పెస్ట్‌ కాంట్రాక్టుతో పాటు, సెక్యూరిటీ ఏజెన్సీలను తొలగిస్తున్నామన్నారు. సంఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, తమది బాధ్యత కలిగిన ప్రభుత్వమని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. ప్రతిపక్ష నాయకులు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మను మహిళ అని కూడా చూడకుండా అడ్డుకోవడం చాలా బాధాకరమన్నారు. బాధితురాలిని పరామర్శించిన వారిలో మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ కూడా ఉన్నారు.  

మరిన్ని వార్తలు