అమరావతి రాజధాని కేసు: హైకోర్టు ఆదేశాల్లో సుప్రీం స్టే విధించిన అంశాలివే

28 Nov, 2022 14:38 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ:  కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఏపీ ప్రభుత్వానికి ఇవాళ (సోమవారం) భారీ ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. అభివృద్ధి  అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా?. హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా? అంటూ మందలింపు వ్యాఖ్యలు చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ తరుణంలో..  ఏపీ హైకోర్టు 7 అంశాలతో ఇచ్చిన తీర్పులోని.. చివరి ఐదు అంశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 

1. AP CRDA 2015 లాండ్‌ పూలింగ్‌ షెడ్యూల్ 2 మరియు 3 నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం, CRDA నిర్వర్తించాలి

2. థర్డ్‌ పార్టీ ప్రయోజనాలకు పూలింగ్‌ లాండ్‌ తనఖా పెట్టారాదు. రాజధాని నిర్మాణం, కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌కు తనఖా పెట్టవచ్చు

3. CRDA యాక్ట్‌ సెక్షన్‌ 58 ప్రకారం  రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు ప్రాసెస్‌ తీర్పు వచ్చిన తేదీ నుంచి నెలరోజుల్లో పూర్తిచేయాలి

4. APCRDA యాక్ట్‌ సెక్షన్‌ 61 ప్రకారం టౌన్‌ మాస్టర్‌ ప్లానింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం, CRDA కలిసి పూర్తి చేయాలి

5. డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కమ్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఫామ్‌ 9.14 ప్రోవిజన్‌ - CRDA యాక్ట్‌ 2015లోని నిబంధనల ప్రకారం 6 నెలల్లో అమరావతి కేపిటల్‌ సిటీ, కేపిటల్‌ రీజియన్‌ నిర్మాణం చేపట్టాలి

6. ప్రభుత్వం మరియు CRDA కలిసి రోడ్లు, తాగునీరు, ప్రతిప్లాట్‌కు విద్యుత్‌ కనెక్షన్‌, డ్రైనేజి సహా ఏర్పాటు చేసిన అమరావతి కేపిటల్‌ సిటీ నివాసయోగ్యంగా మార్చాలి

7. రాష్ట్ర ప్రభుత్వం మరియు APCRDA కలిసి భూములిచ్చిన రైతులకు ప్రామిస్‌ చేసినట్టుగా అమరావతి కేపిటల్‌ రీజియన్‌లో స్థలాలు 3 నెలల్లోగా కేటాయించాలి 
  

రాష్ట్రప్రభుత్వం, సీఆర్‌డీఏలు అక్కడ జరుగుతున్న అభివృద్ధిపై ఎప్పటికప్పుడు వేర్వేరు అఫిడవిట్లు సమర్పించాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఆరు నెలల్లో నిర్మాణం చేయాలంటారా?. మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్‌ ఎందుకు? అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా? హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించింది అంటూ సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలే చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.


👇

హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా?: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు