నోటీసుల్లో లోకేష్‌కు సీఐడీ ఏం చెప్పిందంటే..?

30 Sep, 2023 19:32 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో ఏపీ సీఐడీ వేగం పెంచింది. ఢిల్లీలో ఇవాళ నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేసింది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలని సీఐడీ ఆదేశించింది. అమరావతిలో ఎక్కడెక్కడ భూములు కొన్నారు? లావాదేవీల వివరాలివ్వాలని సూచించిన సీఐడీ.. హెరిటేజ్‌ బోర్డు సమావేశాల మినిట్స్‌తో కూడిన బుక్‌ సమర్పించాలంది. మినిట్స్‌ను ఆధారంగా చేసుకుని జరిపిన బ్యాంకు లావాదేవీలేంటీ?. చెల్లింపు వివరాలను పూర్తిగా అందించాలని నోటీసుల్లో పేర్కొంది.

నోటీసుల్లో 10 అంశాలు..
భవిష్యత్తులో ఎలాంటి నేరానికి పాల్పడకూడదు
ఇన్నర్‌ రింగ్‌ రోడ్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లో తారుమారు చేయకూడదు
ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని.. బెదిరింపులు కాని ప్రలోభాలు కాని గురిచేయకూడదు
పిలిచినప్పుడు కోర్టు ముందు తప్పక హాజరు కావాలి
విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరై అధికారులకు సహకరించాలి
వాస్తవాలను దాచిపెట్టకుండా వెల్లడించాలి
హెరిటెజ్ ఫుడ్స్ బ్యాంక్ అకౌంట్ల వివరాలను విచారణ అధికారులకు ఇవ్వాలి
భూముల కొనుగోలుకు సంబంధించి హెరిటేజ్ బోర్డ్ డైరెక్టర్ల మీటింగ్ మినిట్స్ ఇవ్వాలి
అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి లావాదేవీల వివరాలు విచారణకు హాజరయ్యే సమయంలో తీసుకురండి
నోటీసులు అందుకున్నాక విచారణకు రాకపోయినా, నిబంధనలను పాటించకపోయినా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ(3), (4) ప్రకారం మీ అరెస్టు తప్పదు

కాగా, రాజధాని పేరిట లింగమనేనితో క్విడ్‌ ప్రో కో నడిపిన చంద్రబాబు కుటుంబం & హెరిటేజ్‌.. రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని భూములు కొన్నారు. లింగమనేని నుంచి కరకట్ట గెస్ట్‌హౌజ్‌ను చంద్రబాబు కుటుంబం తీసుకుంది. రూ.29 లక్షలు నగదు రూపంలో ఇచ్చానని భువనేశ్వరీ చెబుతున్నారు. హెరిటేజ్‌తో ఏ ఏ లింకులు ఉన్నాయో క్షుణ్ణంగా సీఐడీ పరిశీలన చేసింది.
చదవండి: ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కాం: నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు 

మరిన్ని వార్తలు