ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు: కోన శశిధర్‌

10 Jun, 2021 15:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ తెలిపారు. గతం కంటే ఎక్కువ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రబీ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 25 లక్షల 25 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు చేయగా ఎప్పుడూ లేని విధంగా కడప, కర్నూల్‌లో అధికంగా కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు.

ఇక రైతులు, దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొంటున్నామని, ఈ క్రమంలో రైతుల పొలాలకు వెళ్లి ధాన్యం కోనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్‌బీకేల్లో రైతులకు రిజిస్ట్రేషన్‌, కొనుగోలు కూపన్లు ఇవ్వడం ద్వారా రైతులకు పేమెంట్‌ ఆలస్యం లేకుండా చేస్తున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి రూ.3,900 కోట్లు రావాల్సి ఉండగా, కేంద్రం ఏటా ఇచ్చే అడ్వాన్స్‌ కూడా ఇవ్వలేదని అయినా పెండింగ్‌లో ఉన్న రూ.300 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. జులై నెలాఖరు వరకు ధాన్యం సేకరణ చేస్తామని అన్నారు.

చదవండి: Jagananna Vidya Kanuka: నాణ్యమైన ‘కానుక’.. ఈ ఏడాది అవి అదనం

మరిన్ని వార్తలు