హైకోర్టు ఉత్తర్వులు: కారణాలు సహేతుకంగా లేవు!

17 Sep, 2020 15:51 IST|Sakshi

సీనియర్‌ జర్నలిస్టు తెలకపల్లి రవి వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ అడ్వకేట్ జనరల్‌పై ఏసీబీ పెట్టిన ఎఫ్ఐఆర్ గురించి వార్తలు రాయొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం తీవ్రమైన, అసాధారణ విషయమని సీనియర్‌ జర్నలిస్టు తెలకపల్లి రవి అన్నారు. అమరావతిలో భూ లావాదేవీల్లో అక్రమాలు జరిగిన మాట వాస్తవమని, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు భూములు కొంటే తప్పేముందని శాసన సభలో వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. అక్రమాలు జరిగి ఉంటే దోషుల్ని శిక్షించాల్సిన పని న్యాయ వ్యవస్థదేనని పేర్కొన్నారు. (చదవండి: హైకోర్టు ఉత్తర్వులపై జాతీయ స్థాయిలో ఆందోళన)

అదే విధంగా.. ప్రజా జీవితానికి భంగం కలిగే అంశాలకే కోర్టులు అసాధారణ ఉత్తర్వులు ఇస్తాయని, కానీ ఇలా భావ ప్రకటనను హరించే విధంగా వ్యవహరించడం దేనికి సంకేతమని రవి ప్రశ్నించారు. అసలు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వటానికి చెప్పిన కారణాలు కూడా సహేతుకం కాదని, వీటికి సంబంధించి సుప్రీంకోర్టులోనైనా సరైన మార్గదర్శకాలు లభిస్తాయని ఆశిద్దామని తెలకపల్లి రవి పేర్కొన్నారు. న్యాయస్థానాలు మీడియా స్వేచ్ఛను హరించడం సరికాదని సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయటం దారుణమన్నారు.
(చదవండి: హైకోర్టు ఉత్తర్వులు : కేంద్రం జోక్యం చేసుకోవాలి)

మరిన్ని వార్తలు