మరోసారి సత్తా చాటిన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

30 Jun, 2022 18:45 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సత్తా చాటింది. మరోసారి ఆంధ్రప్రదేశ్‌  నెంబర్‌ వన్‌ స్థానంలో నిలవడం పట్ల సంతోషంగా ఉందని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ అన్నారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'దేశంలోనే ఏపీ మొదటి స్థానం సంపాదించడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనతే. పరిశ్రమలకు సీఎం జగన్‌ చక్కని ప్రోత్సాహం ఇస్తున్నారు. 

పారిశ్రామిక పెట్టుబడులకు ఏపీ అనుకూలం. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. సీఎం జగన్‌ రెండురోజుల క్రితం ఇదే విషయం చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి అందిస్తున్న సహకారానికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కోవిడ్‌ ఇబ్బందులు పరిశ్రమలకు కలగకుండా సీఎం ఆదేశాలతో అధికారులు సహకరించారు. టాప్‌ అచీవర్స్‌గా ఏపీ దేశంలోనే మొదటి స్థానం సంపాదించడం గర్వంగా ఉంది' అని మంత్రి గుడివాడ అమరనాథ్‌ తెలిపారు. 

చదవండి: (బిజినెస్‌ రీఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-2020: ఏపీకి టాప్‌ ప్లేస్‌)

మరిన్ని వార్తలు