అమెజాన్‌ యాప్‌లోనూ రైలు టికెట్లు

9 Oct, 2020 09:09 IST|Sakshi

ఐఆర్‌సీటీసీతో కుదిరిన ఒప్పందం

మొదటిసారి  బుక్‌ చేసుకునే వారికి 10% రాయితీ

ప్రైమ్‌ సభ్యులకు 12 శాతం వరకు డిస్కౌంట్‌

సాక్షి, అమరావతి: రైల్వే ప్రయాణికులకు త్వరలోనే అమెజాన్‌ పేయాప్‌ ద్వారా సేవలు అందనున్నాయి. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ, అమెజాన్‌ మధ్య టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఇప్పటికే అమెజాన్‌ పేయాప్‌ ద్వారా విమాన, బస్సు టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అమెజాన్‌ పే యాప్‌ ద్వారా మొదటిసారి టికెట్లు బుక్‌ చేసుకునే వారికి 10 శాతం నగదు రాయితీ లభించనుంది. అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులకు 12 శాతం వరకు రాయితీ ఉంటుంది.

కాగా రైల్వే అధికారులు ఈ–కామర్స్‌ కంపెనీలతో సరుకు రవాణాకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోనున్నారు. త్వరలోనే ఫ్లిప్‌ కార్ట్‌ కంపెనీ దక్షిణ మధ్య రైల్వేతో  ఒప్పందం కుదుర్చుకోనుంది. (చదవండి: ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో బంపర్‌ ఆఫర్‌ సేల్స్)‌

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ ఆఫర్‌
అక్టోబర్‌ 17న ప్రారంభం

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ సందర్భంగా ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ‘‘గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌’’ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 17న ప్రారంభమవుతుంది. సుమారు 6.5 లక్షల మంది పైగా విక్రేతలు కోట్లలో తమ ఉత్పత్తులను కస్టమర్లకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఆఫర్‌ ద్వారా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సుమారు 900కి పైగా తమ  ఉత్పత్తులను ఆవిష్కరించనున్నాయి. ఈ పండుగ సీజన్లలో తమ కస్టమర్లకు కావల్సిన వస్తువులను సరైన సమయంలో, సురక్షితంగా అందించడం తమ కర్తవ్యమని అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మనీశ్‌ తివారీ తెలిపారు. 

మరిన్ని వార్తలు