ప్రాజెక్టులపైనా చంద్రబాబుది ద్వంద్వ వైఖరే..మాది రైతుల ప్రభుత్వం: మంత్రి అంబటి 

13 Sep, 2022 12:24 IST|Sakshi

సాక్షి, నంద్యాల: టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. చంద్రబాబు లాగా మాకు ప్రాజెక్ట్‌లపై ద్వంద వైఖరి ఉండదు. మాది రైతుల ప్రభుత్వమని ఏపీ జల వనురుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 

మంత్రి అంబటి రాంబాబు మంగళవారం నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ రాయలసీమకు వరం. పోలవరంను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. చంద్రబాబు ఏనాడు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కానీ, ప్రతీ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయం. రాష్టంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల వద్ద గేట్లకు మరమ్మతులు చేపడుతున్నాము. 

చంద్రబాబు లాగా మాకు ప్రాజెక్టులపై ద్వంద వైఖరి ఉండదు. మాది రైతుల ప్రభుత్వం. వైఎస్సార్‌ కుటుంబం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుంది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కరువుతో రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. నేడు వర్షం కోసం రైతులు ఎదురుచూడాల్సిన పనిలేదని అన్నారు. 

>
మరిన్ని వార్తలు