అబద్దాలకు లిమిట్‌ లేదా.. 1983లో చంద్రబాబు టీడీపీలో ఉన్నారా?: అంబటి ఫైర్‌

30 Jul, 2022 18:16 IST|Sakshi

సాక్షి, విజయవాడ: గోదావరి వరదలపై చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రభుత్వం అందించిన సాయం చూడలేక కడుపు మంటతో చంద్రబాబు రగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. 

మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘గోదావరి వరదల సమయంలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వరద సహాయం అందించడానికి ప్రజల దగ్గరికి వెళ్లారు. గోదావరి వరద ఉధృతితో భారీ నష్టం జరిగింది. వరదల కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ చర్యలపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ప్రజల హర్షాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. పరామర్శల పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తన్నారు. 

1983లో చంద్రబాబు టీడీపీలో ఉన్నారా?. 1983లో భద్రాచలంలో కట్ట కట్టానని చంద్రబాబు చెబుతున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హెలికాప్టర్‌ వాడలేదా అని ప్రశ్నించారు. బాధితులకు చంద్రబాబు ఎప్పుడైనా రూ. 2వేల సాయం అందిచారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక చంద్రబాబు జీవితం మొత్తం రోడ్లపై తిరగడమేనని అన్నారు. ఐదేళ్ల పాలనలో బాబు ఏం చేశారో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.  

ఇది కూడా చదవండి: ఏది గుడ్‌.. ఏది బ్యాడ్‌?.. అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి

మరిన్ని వార్తలు