దీం దుంపతెగ టీడీపీ.. అన్నీ అబద్ధాలే: మంత్రి అంబటి

15 May, 2022 17:24 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార‍్సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95శాతం నెరవేర్చిందని జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార‍్సీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. గడప గడపకు కార్యక్రమం ద్వారా ఆ విషయం తెలుస్తోంది. తన జీవితంలో నిజాలు చెప్పని ఏకైక వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు’’ అని విమర్శించారు.

‘ఎన్నికలకు ముందు మా నాయకుడి ఆదేశాలతో గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టాం.ఏమి చేస్తామో ఆరోజు చెప్పాము...అది ఇప్పుడు చేసి చూపిస్తున్నాం. మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టాం. ఆ రోజు వెళ్లాం...ఈ రోజు వెళుతున్నాం...భవిష్యత్తులో వెళ్తాం.ప్రతి గడపకు ధైర్యంతో వెళ్లి చేసింది చెప్తాము.  ప్రతి ఇంటికి ఎంత మేర సంక్షేమ పథకాలు అందాయో చెప్తున్నాం. ఈ మూడేళ్ళలో ఏ విధంగా పరిపాలన సాగిందో ప్రింటెడ్ గా ఇస్తున్నాం. దేశంలో చెప్పింది చేశామని ప్రజల వద్దకు వెళుతున్న ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. మేనిఫెస్టో తీసుకెళ్లి వాటిలో ఏమి చేసాం అనేది స్పష్టంగా చెప్తున్నాం. మేనిఫెస్టోను దాచేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని చూశాం. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పిన ప్రభుత్వం వాళ్ళది.

పురాణాల్లో నిజం చెప్పే వ్యక్తి సత్య హరిచంద్రుడు అయితే ఆయనకి వ్యతిరేక వ్యక్తి అప్పట్లో దొరకలేదు. కానీ ఇప్పుడు లేస్తే అబద్దాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు దొరికాడు. చంద్రబాబు ఎందుకు కలిసి వెళ్ళాలి అని ఎందుకంటున్నాడో ఇప్పుడు అర్థం అవుతోంది. ప్రజలు ఈ ప్రభుత్వానికి నీరాజనాలు పడుతున్నందువల్లే ఆయన అలా మాట్లాడారు. ప్రజా వ్యతిరేకత ఉందంటూ రాతలు రాస్తున్నారు. మేము అందరి ఇళ్ళకి వెళుతున్నాం. టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్లి చేసింది చెప్తున్నాం. చంద్రబాబు చివరి రెండేళ్ళు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బాకీ పెట్టి వెళ్లారు...దాన్ని జగన్ చెల్లించారు.

ఉచిత విద్యుత్ బకాయిలు పెడితే ఆ బాకీని మేము తీర్చాం. సీఎం ప్రతి కుటుంబానికి ఒక లేఖ రాశారు..దాన్ని కూడా ప్రతి గడపకు తీసుకెళుతున్నాం.  ప్రజా బ్యాలెట్ ఇస్తున్నాం...50 ప్రశ్నలతో ప్రజలే సమాధానం ఇచ్చేలా బ్యాలెట్ పెట్టాం. మేము వెళ్ళినప్పుడు ప్రజల ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది’ అని అంబటి తెలిపారు.

మరిన్ని వార్తలు