డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడానికి టీడీపీ తప్పిదమే కారణం: మంత్రి అంబటి

18 Jul, 2022 12:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అంబటి రాంబాబు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ హయంలో దేవినేని ఉమ పోలవరంను ఎందుకు పూర్తి చేయలేదు?. జనం దేవినేని ఉమాను, టీడీపీని పీకి పారేశారు. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడానికి టీడీపీ తప్పిదమే కారణం. కాపర్‌ డ్యామ్‌ పూర్తి చేయకుండా డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తి చేస్తారా’’ అని ప్రశ్నించారు. 

ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకున్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వరద రాజకీయం చేయడానికి చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారా?. గోదావరికి ఉధృతంగా వరదలు వచ్చాయి. ఎప్పుడు కూడా జూలై నెలలో ఈ స్థాయిలో వరదలు రాలేదు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సహాయక చర్యలు చేపట్టాము. కరకట్టలు తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుక్షణం మానిటర్‌ చేస్తూనే ఉన్నారు అని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు