ప్రొద్దుటూరు: ప్రైవేట్‌ అంబులెన్స్‌లో పేలుడు

17 Aug, 2021 12:27 IST|Sakshi

వైఎస్సార్‌ కడప: వైఎస్సార్‌ కడప జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులో ఒక ప్రైవేటు అంబులెన్స్‌లో గ్యాస్‌ ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి.

ఈ క్రమంలో స్థానికులు.. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు