పరుగులు పెట్టించిన ‘ఫిర్యాదు’.. తూచ్‌... బీరువాలోనే ఉన్నాయి..! 

1 May, 2022 17:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం\

మాకవరపాలెం(అనకాపల్లి జిల్లా): నగదు, బంగారం చోరీకి గురయ్యాయని పొరపాటున ఇచ్చిన ఫిర్యాదు పోలీసులను పరుగులు పెట్టించింది. తమ్మయ్యపాలేనికి చెందిన రొంగల బుల్లిబాబు శనివారం ఉదయాన్నే నిద్ర లేచేసరికి ఇంట్లో బీరువా తలుపులు తెరిచి ఉండడంతో ఇందులోని 25 తులాల బంగారం, రూ.లక్ష నగదు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చదవండి: తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం..

దీంతో క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ తమ్మయ్యపాలెం చేరుకున్నాయి. ఏఎస్పీ మణికంఠచందోల్‌ కూడా వచ్చి పరిశీ లించారు. అయితే బీరువాలోని మరో అరలోనే బంగారం, నగదు ఉన్నట్టు క్లూస్‌ టీం గుర్తించింది. దీంతో బుల్లిబాబు సరిగా వెతకకుండా తొందర పడి ఫిర్యాదు చేశానని తెలపడంతో పోలీసులు వెనుదిరిగారు.  

మరిన్ని వార్తలు