1998 DSC Qualifier: లేటు వయసులో ఫలించిన నిరుద్యోగి కల 

22 Jun, 2022 18:11 IST|Sakshi
కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకుంటున్న బాబూరావు

1998 డీఎస్సీకి ఎంపికైన బాబూరావు  

సాక్షి, అనకాపల్లి: ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 1998 డీఎస్సీలో ఎంపికైన వారికి ఉద్యోగావకాశం కల్పిస్తూ ఫైల్‌పై (జీఓ జారీ) సంతకం చేయడంతో రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగి పంట పండింది. 23 ఏళ్లుగా ఉపాధ్యాయ కొలువు కోసం ఎదురు చూస్తున్న అతని నిరీక్షణ ఫలించింది. గ్రామానికి చెందిన పసగడుగుల బాబూరావు (57)కు పెళ్లయి పిల్లలు కూడా పెద్ద వాళ్లయ్యి పెళ్లీడుకు వచ్చారు.

ఈ నేపథ్యంలో 1998 నుంచి నేటి వరకు ఎంతో మంది మంత్రులు, ముఖ్యమంత్రులు మారారు. ప్రభుత్వాలు మారాయి. ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దయతో మా వంటి అభాగ్యులకు మంచి చేస్తున్నారు. ఆయన రుణం తీర్చుకోలేనిది అంటూ భార్య, ముగ్గురు పిల్లలతో ఈ సంతోషాన్ని పంచుకున్నాడు.  

1998 డీఎస్సీ క్వాలీఫైడ్‌ అభ్యర్థుల హర్షం..  
మాడుగుల రూరల్‌: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంతో 1998 డీఎస్సీ క్వాలీఫైడ్‌ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, పాడేరు, తదితర నియోజకవర్గాల్లో 1998 డీఎస్సీ క్వాలీఫైడ్‌ అభ్యర్థులు 500 మందికి పైగా ఉన్నారు. గత పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు