ఎమ్మెల్యే రామానాయుడికి ఆనందప్రకాష్‌ కౌంటర్‌

15 Sep, 2020 13:03 IST|Sakshi
ఎమ్మెల్యే నిమ్మలకు కౌంటరిస్తూ మేనిఫెస్టోలోని అంశాలు చదివి వినిపిస్తున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనందప్రకాష్‌

పాలకొల్లు అర్బన్‌: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వక్రీకరిస్తూ మేనిఫెస్టోలో లేని అంశాలు ప్రస్తావించి డ్వాక్రా మహిళలను తప్పుదారి పట్టించబోయిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లెం ఆనంద ప్రకాష్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఆసరా వారోత్సవాల్లో భాగంగా పాలకొల్లు రూరల్‌ పంచాయతీ సబ్బేవారిపేట గ్రామ సంఘంలో సోమవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ అమ్మ ఒడి పథకాన్ని వక్రీకరిస్తూ తల్లికి ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నా కేవలం ఒకరికే పథకం అమలు చేస్తున్నారని అన్నారు. ఇంతలో ఆనంద ప్రకాష్‌ జోక్యం చేసుకుని అమ్మఒడి పథకంలో బిడ్డల సంరక్షణ కోసం తల్లి ఖాతాలో రూ.15వేలు జమ చేస్తున్నారని, అంతేకాని ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తానని చెప్పలేదంటూ మేనిఫెస్టోని చదివి వినిపించారు. (అంతర్వేది: కొత్త రథం నిర్మాణ డిజైన్లు ఖరారు)

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిందే చేస్తారని, చంద్రబాబునాయుడిలా సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేయరన్నారు. మద్యపానం విషయంలోనూ డ్వాక్రా మహిళలను తప్పుదారి పట్టించబోయిన ఎమ్మెల్యేకి గట్టిగా బదులిచ్చారు. టీడీపీ హయాంలో 40 వేల బెల్ట్‌షాపులుండేవని, వాటిని రద్దు చేసి ప్రభుత్వమే మద్యం విక్రయించే పాలసీ తీసుకుందని సమాధానం ఇచ్చారు. అనంతరం సీఎం జగన్‌కి డ్వాక్రా మహిళలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పాల్గొనాలని డ్వాక్రా మహిళలు కోరినా ఎమ్మెల్యే నిమ్మల జారుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నక్కా ఇర్మియారాజు, సబ్బే శ్రీను, పుల్లూరి నరేష్, ఏపీఎం పి.సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   (దమ్ముంటే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలి)

మరిన్ని వార్తలు