అనుమతులొచ్చిన అనంతరమే మందు పంపిణీ

29 May, 2021 03:49 IST|Sakshi

ఆనందయ్య

ముత్తుకూరు: కరోనా నివారణకు తాను తయారు చేసిన ఆయుర్వేద మందుపై అధ్యయనం జరుగుతుందని, ప్రభుత్వ అనుమతి రాగానే మందు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొనిగి ఆనందయ్య తెలిపారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం మందు పంపిణీ జరుగుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

ప్రస్తుతానికి తమ వద్ద మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు లేవని చెప్పారు. ప్రభుత్వం ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేసిన తర్వాత సీవీఆర్‌ కాంప్లెక్స్‌లో ఉంటున్న బొనిగి ఆనందయ్య శుక్రవారం కృష్ణపట్నంలోని తన ఇంటికి చేరాడు. ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. దీంతో పోలీసులు ఆయనకు రక్షణగా నిలిచారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు