ప్యాంట్‌ కోసం గొడవ.. మీకెలా కనబడుతున్నాం?

19 Jan, 2021 08:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అనంతపురం : ప్యాంట్‌ తెచ్చిన తంటా ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. టూటౌన్‌ ఎస్‌ఐ రాంప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఓబుళదేవనగర్‌కు చెందిన ప్రసాద్‌ హౌసింగ్‌బోర్డులోని రాహుల్‌ (ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌) ఇంటిలో దోబీ పనికి వెళ్లేవాడు. ఇటీవల వేరొకరి ప్యాంట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఇంటికి వెళ్లింది. దీంతో ప్రసాద్‌ వేరొకరికి చెందిన ప్యాంట్‌ మీ వ్రస్తాల్లో కలిసిందని బీట్‌ ఆఫీసర్‌ కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు ఆ ప్యాంట్‌ తమ వద్ద లేదని, తమ ఓనర్‌ ఇంటిలో ఏమైనా కలసిందేమో కనుక్కొని చెబుతామని సమాధానమిచ్చారు. చదవండి: ఆర్‌సీలు, లైసెన్సు పత్రాలు చూపినా ఓకే

ఈ విషయమై ఇంటి యజమాని చంద్రశేఖర్‌ అతని కుటుంబ సభ్యుడు రాజేష్‌ ‘మీకెలా కనబడుతున్నాం’ అంటూ ప్రసాద్‌పై మండిపడ్డారు. ప్రసాద్‌ తన సోదరుడు రమణ, తదితరులను తీసుకుని బీట్‌ ఆఫీసర్‌ ఇంటిపైకి వెళ్లాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి బీట్‌ ఆఫీసర్‌ ఓ కర్రతో రమణపై దాడి చేయగా కంటికి గాయమైంది. దీంతో వారు సోమవారం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రసాద్, రమణలు తమపై దాడికి వచ్చారంటూ చంద్రశేఖర్, రాజేష్‌, బీట్‌ ఆఫీసర్‌ రాహుల్‌ కూడా ఫిర్యాదు చేశారు. పరస్పర ఆరోపణల నేపథ్యంలో టూటౌన్‌ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.  

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు