మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు బిగుస్తోన్న ఉచ్చు

4 Mar, 2021 14:33 IST|Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు గురువారం ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది మార్చి నెలలో రాయదుర్గంలో ఎన్నికల అధికారులను బెదిరించిన కేసులో కాల్వ శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రితో సహా 24 మంది టీడీపీ కార్యకర్తలకు అనంతపురం కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ముగ్గురు పిల్లలు ఉన్న టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కాగా గతంలో తన అనుచరులతో కలిసి ఎన్నికల అధికారులను కాల్వ శ్రీనివాస్‌ బెదిరించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు