కూలీ ఇంటికి రూ.లక్షల్లో కరెంట్‌ బిల్లు

28 Aug, 2021 10:29 IST|Sakshi

 కూలీ ఇంటికి రూ.లక్షల్లో బిల్లు

 విద్యుత్‌ అధికారులను ఆశ్రయించిన బాధితులు 

 కొద్దిమేర తగ్గించి మిగతాది కట్టమంటున్న వైనం  

సాక్షి, ఉరవకొండ: విడపనకల్లు మండల పరిధిలోని పాల్తూరు గ్రామంలో కరెంటు బిల్లుల మోత మోగుతోంది. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంతో సామాన్య రైతు, కూలీ కుటుంబాలకు లక్షల్లో కరెంటు బిల్లులు వస్తుండటంతో బాధితులు షాక్‌కు గురవుతున్నారు. గ్రామానికి చెందిన చెందిన సాధారణ కూలీ పర్వతప్పకు ప్రతి నెలా రూ.200 నుంచి రూ.300 బిల్లు వచ్చేది. కానీ జూన్‌కు సంబంధించిన బిల్లు ఏకంగా రూ.1,48,371 రావడంతో అవాక్కయ్యాడు.

విద్యుత్‌శాఖ అధికారుల వద్దకు వెళ్ళి తనకు వచ్చిన కరెంట్‌ బిల్లు చూపించాడు. తాను కూలీ పనులకు వెళ్ళే వాడినని తన ఇంటోŠల్‌ రెండు బల్పులు, ఒక ఫ్యాను, టీవీ మాత్రమే ఉందని, ఇంత బిల్లు ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. పర్వతప్పపై అధికారులు చివరికి కనికరం చూపి రూ.56,399 తగ్గించి మిగతా బిల్లు మొత్తం కట్టాలని అధికారులు సూచించారు. తాను కూలీ పనులకు వెళ్ళేవాడినని తాను ఇంత డబ్బు ఎలా కట్టగలలని కూలీ లబోదిబోమంటున్నాడు. అలాగే గ్రామానికి చెందిన బండయ్య అనే మరో కూలీకి చెందిన ఇంటికి కూడా రూ 16,251 రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నాడు. వీరిద్దరికే కాదు ఇలా గ్రామంలో 15 మంది కూలీ కుటుంబాలకు అధిక సంఖ్యలో బిల్లులు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.  

కొంతమేర బిల్లు తగ్గించాం 
పాల్తూరు గ్రామంలో సాంకేతిక సమస్య కారణంగానే కరెంటు బిల్లులు అధిక సంఖ్యలో బిల్లులు వచ్చాయి. దీంతో పాటు మీటర్‌లో ఏదైనా సమస్య ఉన్నా ఇలా జరుగుతుంది. అధిక సంఖ్యలో బిల్లు వచ్చిన వారికి కొంతమేర బిల్లులు తగ్గించాము. మిగతాది వారు చెల్లిస్తే సరిపోతుంది.  
శ్రీనివాసరెడ్డి, ఏఈ, విద్యుత్‌శాఖ    

చదవండి: కలికిరి బ్యాంకు కుంభకోణంలో ఆసక్తికర విషయాలు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు