కొడిగట్టిన నవ‘దీపం’

8 Dec, 2021 13:23 IST|Sakshi

బాలున్ని కాపాడబోయి రాలిన పండుటాకు 

ఇద్దరి మృతితో చౌళూరులో ఆలుముకున్న విషాదఛాయలు

అనంతపూర్‌: ప్రమాదవశాత్తు నీటిలో పడిన బాలుడిని కాపాడబోయి ఓ పండుటాకు రాలిపోయింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ‘నవదీపం’ కొడిగట్టకుండా ప్రాణాలకు తెగింన వృద్ధుడి సాహసమూ గంగ పాలైంది. పెన్నమ్మ ఒడిలో రెండు నిండు ప్రాణాలు శాశ్వతంగా నిద్రపోయాయి. చౌళరు శోకసంద్రమైంది. వివరాలు.. హిందూపురం మండలం చౌళరుకు చెందిన తలారి నరసింహప్ప కువరుడు నవదీప్‌ (10) స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం పాఠశాల నుం ఇంటికి చేరుకున్న బాలుడు.. తోటి స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని పెన్నానదిలో ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటి గుంతలో పడి పోయాడు.

ఆ సమయంలో చిన్నారులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి దగ్గరలోనే ఉన్న వృద్ధుడు నరసింహమూర్తి (65) అప్రమత్తమై వెంటనే నీటిలో దిగాడు. నీటిలోపల బాలుడి కోసం గాలిస్త ఊపిరి ఆడక అతను విగతజీవిగా మారాడు. అప్పటికే చిన్నారుల నుంచి సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున పెన్నానదికి చేరుకుని నీటిలో గాలింపు చేపట్టారు. కాసేపటికి వృద్ధుడి మృతదేహం లభ్యమైంది.

విషయం తెలుసుకున్న హిందూపురం రరల్‌ పోలీసులు, అగ్నివపక సిబ్బంది, గజ ఈతగాళ్లు అక్కడికి చేరుకుని నీటి గుంతలో గాలింపు చేపట్టారు. రాత్రి 7.30 గంటలకు బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు నెలకొన్నాయి. వృద్ధుడి సాహసం వృథా కావడంపై పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి మృతదేహం కనిపించగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
 

మరిన్ని వార్తలు