JNTU(A): ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌ పరీక్షలు రాసే వీలు

25 Sep, 2021 11:11 IST|Sakshi

జేఎన్‌టీయూ(ఏ)లో నూతన విధానం

అనంతపురం విద్య: ఆండ్రాయిడ్‌ మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్‌.. వీటిలోఏదో ఒకటి ఉంటే చాలు.. పరీక్ష హాలుకు వెళ్లాల్సిన పనిలేకుండా ఉన్నచోటి నుంచే ఆన్‌లైన్‌లో పరీక్ష రాసేయొచ్చు. విద్యార్థులు ఎక్కడి నుంచైనా సరే ఆన్‌లైన్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలు కల్పిస్తూ జేఎన్‌టీయూ (అనంతపురం) నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. బీటెక్‌ సెమిస్టర్‌ ప్రధాన పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్న జేఎన్‌టీయూ (ఏ) ముందుగా మిడ్‌ పరీక్షల్లో దీన్ని అమలు చేసింది. పైలట్‌ ప్రాజెక్ట్‌గా జేఎన్‌టీయూ అనంతపురం క్యాంపస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం మిడ్‌ పరీక్షలను ఈ నూతన విధానంలోనే ప్రారంభించారు.

దీన్ని పరిశీలించాక వర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సెమిస్టర్‌ పరీక్షల్ని ఈ నూతన విధానంలోనే నిర్వహిస్తామని వీసీ జింకా రంగజనార్దన చెప్పారు. నూతన విధానంలో పరీక్ష నిర్వహణ కోసం వర్సిటీ ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ ఏర్పాటు చేసింది. విద్యార్థి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేసిన వెంటనే మెయిల్‌కు ప్రశ్నపత్రం వస్తుంది. పరీక్షల షెడ్యూల్‌ ప్రకారం నిర్దేశించిన సమయానికే ప్రశ్నపత్రం అందుబాటులోకి వస్తుంది. 
 

మరిన్ని వార్తలు