అది చిరుత కాదు.. పులే!

21 May, 2022 11:03 IST|Sakshi

పావగడ(శ్రీ సత్యసాయి): తాలూకా పరిధిలోని నిడుగల్‌ అటవీ ప్రాంతంలో ఇటీవల రోడ్డు దాటుకుంటూ వెళ్లింది చిరుత కాదని.. అది పెద్ద పులేనని బెళ్లిబట్లు గ్రామస్తులు స్పష్టం చేశారు. నిడుగల్‌ దుర్గం సమీపంలోని బెళ్లిబట్లు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో నివసిస్తున్న కొందరు రైతులు గురువారం రాత్రి 11 గంటల సమయంలో పులిని చూసినట్లుగా వివరించారు.

గుడిసెల బయట కట్టేసిన ఆవులు బెదరడంతో తాము లోపలి నుంచి చూడగా.. పెద్ద పులి వెళుతుండడం కనిపించిందన్నారు. గ్రామానికి చెందిన చంద్ర శేఖరరెడ్డి మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం ఉరవకొండకు చెందిన కొందరు భక్తులు యోగి నరసింహస్వామి దర్శనం కోసం కారులో వెళుతూ సాయంత్రం 7 గంటలకు నిడుగల్‌కు వచ్చారని, ఆ సమయంలో తాము రోడ్డు దాటుతున్న పెద్దపులిని చూసినట్లుగా పేర్కొంటూ సెల్‌ఫోన్లలో తీసిని వీడియోలను చూపారని గుర్తు చేశారు. పులి కదలికలపై నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్ని అటవీ శాఖ అధికారులను కోరనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: వాట్సాప్‌ ద్వారా మత్తు విక్రయం

మరిన్ని వార్తలు