అనంతలో విషాదం: ట్రాక్టర్‌పై కరెంట్‌ తీగలు తెగిపడి కూలీల దుర్మరణం

2 Nov, 2022 20:48 IST|Sakshi

అనంతపురం: ఏపీ- కర్నాటక సరిహద్దుల్లో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్‌ మండలం దర్గహొన్నూర్‌లో బుధవారం ఘోరం జరిగింది. ట్రాక్టర్‌పై విద్యుత్‌ తీగలు తెగిపడి వ్యవసాయ కూలీలు మృతి చెందినట్లు సమాచారం.

పంట కోతల కోసం పని చేస్తుండగా మెయిన్‌ లైన్‌ తీగలు ట్రాక్టర్‌పై తెగిపడి ఈ ఘోరం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. 

దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన శంకరమ్మ, లక్ష్మి, సరోజమ్మ, వడ్రక్క అక్కడికక్కడే మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన రత్నమ్మ,  పార్వతి తీవ్ర గాయాలతో బళ్లారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవాళ్లలో మరొకరి మృతితో.. మృతుల సంఖ్య ఐదుకి చేరింది. ఇక ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఎక్స్‌గ్రేషియా ప్రకటన
దర్గాహోన్నూరు ఘటనపై రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారాయన. అంతేకాదు.. ఒక్కొ మృతురాలి కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారాయన.

మరిన్ని వార్తలు