ఇంగ్లిష్‌ జల సంధిని ఈదిన హెడ్‌ కానిస్టేబుల్‌.. 15 గంటల‍్లోనే పూర్తి!

30 Jul, 2022 08:48 IST|Sakshi

విజయవాడ: స్విమ్మింగ్‌ మౌంట్‌ ఎవరెస్ట్‌గా ప్రసిద్ధికెక్కిక ప్రఖ్యాత ఇంగ్లిష్‌ జలసంధిని అంతర్జాతీయ స్విమ్మర్‌ తులసీచైతన్య సునాయాసంగా ఈదాడు. ఇంగ్లండ్‌లోని డోవర్‌ తీరం నుంచి ఫ్రాన్స్‌లోని కలైస్‌ తీరం వరకూ ఈ జలసంధి ఉంది. అక్కడి ఆర్గనైజర్లకు రూ.4 లక్షలు చెల్లించి ఆయా దేశాల అనుమతులు తీసుకుని ఈ నెల 27న 33.79 కిలోమీటర్ల పొడవున్న జలసంధిని 15 గంటల 18 నిమిషాల్లో ఈదాడు.

స్విమ్మర్‌ తులసీచైతన్య విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గతంలో పాక్‌ జలసంధి(భారత్‌–శ్రీలంక), జీబ్రా జలసంధి(తరిఫా–మెహారో), బోడెన్‌సీ జలసంధి(జర్మనీ–స్విట్జర్లాండ్‌)లను ఈదిన రికార్డులున్నాయి. ఇంగ్లండ్‌ తీరంలో ఉన్న మరో రెండు జల సంధులను ఈదేందుకు తులసీచైతన్య సిద్ధమవుతున్నాడు. మైనస్‌ డిగ్రీల చలి, షార్క్‌లు, జెల్లీ ఫిష్‌లు కలిగిన ఇంగ్లిష్‌ జలసంధిని సాహసోపేతంగా ఈదిన తులసీచైతన్యను కృష్ణా జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రమేష్‌ అభినందించారు.

ఇదీ చదవండి: Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం

మరిన్ని వార్తలు