ఊరుకాని ఊరులో.. ఇది కదా మానవత్వం అంటే!

3 May, 2022 14:07 IST|Sakshi

అల్లూరి సీతారామరాజు జిల్లా:  హుకుంపేట మండల కేంద్రంలో కంటి అద్దాలు అమ్ముకోవడానికి వచ్చిన తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ఇక్కడ అనారోగ్యానికి గురై మృతి చెందాడు. స్థానిక సీపీఎం కాలనీలో జీవనం సాగిస్తూ కొద్ది రోజులుగా పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతున్న రాజు(29)అరకులో తమకు తెలిసిన కుటుంబ సభ్యుల వద్దకు ఆదివారం వెళ్లారు. అయితే రాజు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో సోమవారం అక్కడే మృతి చెందాడు.

ఊరు కాని ఊరులో భర్త మృతి చెందడంతో అతని భార్య పుష్ప తీవ్ర వేదనకు గురైంది. విషయం తెలుసుకున్న స్థానిక కాలనీ వాసులు హైమావతి, ఆనంద్, కృష్ణారావు ఆర్థిక సహాయం చేసి మృతదేహాన్ని తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లాకు ప్రత్యేక వాహనంలో తరలించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.  మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకెళ్లడానికి మానవత్వంతో సహకరించినవారికి మృతుడి భార్య కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని వార్తలు